విజయ్ దేవరకొండ అప్ కమింగ్ ప్రాజెక్టులు

Friday,November 01,2019 - 03:41 by Z_CLU

మీకు మాత్రమే చెప్తా అంటూ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా ఉన్న దేవరకొండ.. పనిలోపనిగా తన అప్ కమింగ్ మూవీస్ గురించి కూడా బయటపెట్టాడు. ప్రస్తుతం తన చేతిలో 4 సినిమాలున్నట్టు ఎనౌన్స్ చేశాడు దేవరకొండ.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్. మరో 8 రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది. ఆ తర్వాత హీరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదని త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు విజయ్.

హీరో సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనవరి నుంచి ఫైటర్ సినిమా స్టార్ట్ చేస్తాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాను ఏకథాటిగా పూర్తిచేస్తాడు. ఆ తర్వాతే హీరో సినిమాను మళ్లీ పట్టాలపైకి తీసుకొస్తాడు.

ఫైటర్ సినిమా కంప్లీట్ చేసి, హీరో అనే సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ఎమోషనల్ లవ్ సబ్జెక్ట్ చేయబోతున్నాడు దేవరకొండ. ఇలా తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ ను బయటపెట్టాడు ఈ హీరో.