అవన్నీ పుకార్లే.. "హీరో"పై నిర్మాతలు క్లారిటీ

Monday,July 29,2019 - 04:44 by Z_CLU

దర్శకుడిపై నమ్మకం తగ్గిపోయిందట.
అందుకే, హీరో సినిమా ఆగిపోయిందట.
జస్ట్ నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరిగిన ప్రచారం ఇది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ “హీరో” అనే సినిమా ఆగిపోయిందంటూ ఓ రేంజ్ లో ప్రచారం నడిచింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తిప్పికొట్టారు. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చారు.

డియర్ కామ్రేడ్ ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాతలు.. హీరో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో భారీ షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. స్వయంగా నిర్మాతలు మీడియా ముందుకురావడంతో హీరోపై నిన్నటివరకు ఉన్న డౌన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి.

ఈ సినిమా కోసం ఢిల్లీలో భారీ షెడ్యూల్ నిర్వహించారు. ఓ రేసింగ్ ట్రాక్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే అటుఇటుగా 4 కోట్లు ఖర్చుపెట్టారు. విదేశీ టెక్నీషియన్స్ చాలామందిని తీసుకున్నారు. అయితే ఈ షెడ్యూల్ తో మేకర్స్ అంతగా ఇంప్రెస్ అవ్వలేదంటూ గాసిప్స్ వచ్చాయి. ఫలితంగా సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఈరోజుతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు ప్రొడ్యూసర్స్.