ఆ సినిమా ఆగిపోలేదంట

Monday,October 21,2019 - 03:15 by Z_CLU

ఒక దశలో సినిమా ఆగిపోయిందంటూ నిర్మాతలే పరోక్షంగా ఫీలర్లు వదిలారు. దీంతో ఆ టైమ్ లో వరుసగా గాసిప్స్ బయల్దేరాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న హీరో అనే సినిమా ఆగిపోయిందంటూ అంతా స్టోరీలు అల్లేశారు. కట్ చేస్తే, ఆ సినిమా కొత్త షెడ్యూల్ డీటెయిల్స్ ప్రకటించారు.

ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో వచ్చే నెల నుంచి “హీరో” సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీంతో ఇన్నాళ్లూ ఈ సినిమాపై వచ్చిన గాసిప్స్ లో నిజం లేదని తేలిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ స్పోర్ట్స్ డ్రామా.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆ ఔట్ పుట్ తో యూనిట్ పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదని, సినిమాను ఆపేశారంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ మూవీ ట్రాక్ లోనే ఉంది. ప్రస్తుతం చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే హీరో సెట్స్ పైకి వచ్చేస్తాడు.

సినిమాలో బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ టైపులోనే హీరో కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రాబోతున్నాడు.