అవన్నీ పుకార్లే.. నాగచైతన్య క్లారిటీ

Thursday,December 12,2019 - 10:12 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు నాగచైతన్య. ఈ క్రమంలో అతడి అప్ కమింగ్ మూవీస్ పై రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. శేఖర్ కమ్ముల సినిమా ఆగిపోయిందని ఆమధ్య కొందరు పుకార్లు పుట్టిస్తే.. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడంటూ మరికొందరు గాసిప్స్ అల్లారు. వీటితో పాటు బంగార్రాజు ప్రాజెక్టు నుంచి చైతూ తప్పుకున్నాడనేది కూడా హాట్ హాట్ గా వినిపించింది. వీటన్నింటిపై చైతూ క్లారిటీ ఇచ్చాడు.

“నాన్నగారితో బంగార్రాజు ప్రాజెక్టు కచ్చితంగా చేస్తాను. కానీ ఆ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఏదో ఒక టైమ్ లో ఆ సినిమా చేస్తాను. దిల్ రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో సినిమా ఇంకా ఫైనల్ అవ్వలేదు. దిల్ రాజు ఇంకా కథపై కాన్ఫిడెంట్ గా లేరు. మేర్లపాక గాంధీ సినిమా కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇలా చాలా సినిమాలున్నాయి కానీ పేపర్ పై ఇంకా ఏదీ సైన్ చేయలేదు.”

ఇలా తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు చైతూ. వెంకీమామను రిలీజ్ కు రెడీ చేసిన ఈ అక్కినేని హీరో.. చేతిలో శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే ఉందని అంటున్నాడు. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారంటూ వస్తున్న రూమర్స్ లో కూడా నిజం లేదంటున్నాడు చైతూ. అది జస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, ఇంకా ఏదీ ఫిక్స్ చేయలేదని అంటున్నాడు.