పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Saturday,December 29,2018 - 01:03 by Z_CLU

ప్రస్తుతం ‘మిస్టర్ కామ్రేడ్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. నిన్నటితో కాకినాడ షెడ్యూల్ కి కూడా సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేశారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ, పెళ్ళెప్పుడు..? అని అడిగిన ప్రశ్నకి రియాక్ట్ అయ్యాడు.

‘పెళ్ళి గురించి పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. మనసులో ఎప్పుడు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినా చేసుకుంటా. ఇప్పుడనిపిస్తే ఇప్పుడే చేసేసుకుంటా. దాని గురించి పెద్దగా స్కెచ్ వేయను’ అని చెప్పుకున్నాడు ఈ క్రేజీ హీరో.

నిన్నా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ హీరో,  ప్రస్తుతం ఒక సినిమా తరవాతే ఇంకో సినిమా అనే  ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘డియర్ కామ్రేడ్’ లో కంప్లీట్ గా డిఫెరెంట్ ఫార్మాట్ లో కనిపించనున్నాడు. భరత్ కమ్మ ఈ సినిమాకి డైరెక్టర్.  మే 2019 లో ఈ సినిమా రిలీజవుతుంది.