రావు రమేష్ కి తల్లిగా నటిస్తున్న సమంతా...

Saturday,December 29,2018 - 12:03 by Z_CLU

వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో రావు రమేష్, సమంతాకి కొడుకుగా కనిపించనున్నాడు. కొరియన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు కావాల్సినన్ని చేంజెస్ చేసి మరీ, ఇంట్రెస్టింగ్ సినిమాలా తెరకెక్కిస్తుంది నందిని రెడ్డి.

ఈ సినిమాలో సమంతా 70 ఏళ్ల ముసలావిడలా కనిపించనుంది. అందుకే రావు రమేష్ కొడుకు. అయితే ఒకరోజు అనుకోని సంఘటన వల్ల 70 ఏళ్ల ముసలావిడ కాస్త యంగ్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుంది. అక్కడి నుండే అసలు సినిమా బిగిన్ అవుతుంది. యంగ్ మదర్ కి కొడుకులా సినిమాలో రావు రమేష్ పడే కష్టాలు సినిమాలో కావాల్సినంత కామెడీని జెనెరేట్ చేస్తాయట.

ఈ సినిమాకి ‘బేబీ – ఎంత సక్కగున్నావే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత.