విజయ్ దేవరకొండ రెండో సినిమా ఇది

Thursday,July 25,2019 - 11:02 by Z_CLU

విజయ్ దేవరకొండ సినిమా ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ లో రీమేక్ అయింది…అదే స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ టాప్ స్టార్స్ కి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకుంటున్నాడు. అయితే ప్రొడ్యూసర్స్ దృష్టి మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యూచర్ సినిమాలపై పడింది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చూశాడు కరణ్ జోహార్. సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు., అప్పుడే ఈ సినిమా రీమేక్ ని కూడా అనౌన్స్ చేసేశాడు. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది.

ఈ లెక్కన ఇకపై విజయ్ దేవరకొండ చేయబోయే ప్రతి సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుందా అంటే చెప్పలేం కానీ, ఈ క్రేజీ హీరో నటించిన సినిమాలు బాలీవుడ్ లో కూడా ఆడతాయి అనే మార్క్ అయితే సక్సెస్ ఫుల్ గా క్రియేట్ అయింది.

‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ కి ముందే రీమేక్ అనౌన్స్ అయిందంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఇప్పటికే రిలీజై సక్సెస్ అందుకున్న సినిమాలపై కూడా పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చూడాలి మరీ…