‘డియర్ కామ్రేడ్’ కూడా అంతేగా!

Tuesday,May 21,2019 - 01:03 by Z_CLU

‘డియర్ కామ్రేడ్’ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ నుండి అభిమానులు ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో, పక్కా అలాంటి ఎలిమెంట్స్ తోనే ఈసారి మెస్మరైజ్ చేయబోతున్నాడు ఈ హీరో. ఒక్కమాటలో చెప్పాలంటే ఆల్మోస్ట్ ‘అర్జున్ రెడ్డి’ స్థాయిలో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది డియర్ కామ్రేడ్.

అర్జున్ రెడ్డి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ స్టూడెంట్ లా కనిపించాడు. ఈ క్రేజీ హీరోని ఫ్యాన్స్ కి దగ్గర చేసింది ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్… అందులోని జెన్యూన్ అనిపించిన అగ్రెసివ్ నెస్. ‘డియర్ కామ్రేడ్’ లో కూడా అంతే. సినిమాకి తగ్గ స్థాయిలో మోస్ట్ అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.

ఇకపోతే ‘డియర్ కామ్రేడ్’ సినిమా వరకు  వచ్చేసరికి ఏ మాత్రం హడావిడి లేకుండా కంప్లీట్ సమయం ఈ సినిమాకే కేటాయించాడు విజయ్ దేవరకొండ. గతంలో ఒకేసారి 2, 3 సినిమాలను సెట్స్ పైకి తీసుకు వచ్చిన ఈ హీరో, ఇప్పటి నుండి ప్రతి సినిమాకి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. కథ దగ్గరి నుండి బిగిన్ అయితే ప్రమోషన్స్ వరకు… ఒక టీజర్.. ఓ 2 సాంగ్స్.. వీటికే ఆడియెన్స్ లో ఈ స్థాయి వైబ్స్ క్రియేట్ అవుతున్నాయంటే ఈ క్రేజీ హీరో ప్లానింగ్ అర్థమైపోతుంది.

దానికి తోడు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతూ ఫ్యాన్స్ కి మరింత కొత్తగా కనిపించబోతున్నాడు. వరస చూస్తుంటే… ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ విషయంలో ‘అర్జున్ రెడ్డి’ తో స్టార్టయ్యే  ఫ్యాన్స్, ఈ సినిమా తరవాత ‘డియర్ కామ్రేడ్’ ని తలుచుకుంటారేమో…