ఒకే నెలలో వస్తున్న అన్నదమ్ములు

Thursday,July 11,2019 - 10:57 by Z_CLU

ఒకరు ఆల్రెడీ స్టార్. మరొకరు ఆ అడుగుజాడల్లో ఇండస్ట్రీకొస్తున్నాడు. వాళ్లిద్దరి సినిమాలు ఇప్పుడు ఒకే నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. పోటీకాకపోయినా, అన్నదమ్ములు సినిమాలు ఒకే నెలలో ఇలా థియేటర్లలో రావడం కాస్త చెప్పుకోదగ్గ విశేషం.

ఆనంద్ దేవరకొండ… స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు. అన్న అడుగుజాడల్లో ఇండస్ట్రీకొస్తున్నాడు. ఆనంద్ హీరోగా పరిచయం అవుతున్న ఆ సినిమా దొరసాని. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ఆనంద్ ఫిల్మీ కెరీర్ ను డిసైడ్ చేయబోతోంది.

తమ్ముడి సినిమాకు ఇప్పటికే ప్రచారం కల్పించిన విజయ్ దేవరకొండ.. తన సినిమాను కూడా ఇదే నెలలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. అదే డియర్ కామ్రేడ్. ఈనెల 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకే నెలలో థియేటర్లలోకి వస్తున్నాయి. ఇద్దరూ తమ తమ సినిమాలతో హిట్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.