నాని న్యూ ఇయర్ గిఫ్ట్

Saturday,December 29,2018 - 03:21 by Z_CLU

న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేశాడు నాని. జనవరి 1న తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు “మీట్ అర్జున్ ఆన్ జనవరి 1” అంటూ ప్రీ-లుక్ రిలీజ్ చేశారు.

స్పోర్ట్స్ బేస్డ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది జెర్సీ. ఇందులో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అని టాక్.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 19న థియేటర్లలోకి రాబోతోంది జెర్సీ.