రష్మిక సక్సెస్ వెనక విజయ్ దేవరకొండ..?

Friday,May 17,2019 - 01:01 by Z_CLU

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటారు. కానీ ఇంత తక్కువ టైమ్ లో రష్మిక స్థాయిలో క్రేజ్ క్రియేట్ అయిన హీరోయిన్స్ అయితే తక్కువే. అయితే రష్మిక ఈ స్థాయిలో ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ విజయ్ దేవరకొండ… ఈ విషయంలో మాత్రం అస్సలు అనుమానం లేదు…

ఫస్ట్ సినిమా ‘ఛలో’ సక్సెస్ అవ్వడం రష్మికకి కలిసొచ్చిన విషయమే కానీ, అయితే అందులో ప్లే చేసింది స్పెషల్ గా రిజిస్టర్ అయిపోయే స్థాయి క్యారెక్టర్ ఏమీ కాదు. రష్మిక ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉన్నా సినిమా సక్సెసయ్యేది. కానీ ‘గీత గోవిందం’ వరకు వచ్చేసరికి మాత్రం రష్మికకు మార్కులేయాల్సిందే. విజయ్ దేవరకొండకు తగ్గ స్క్రీన్ పార్ట్ నర్ అనిపించుకుంది.

ఈ సినిమా తరవాత వచ్చిన ‘దేవదాస్’ గ్రాండ్ సక్సెస్. కానీ కథ మొత్తం తిరిగేది హీరోల చుట్టే కాబట్టి రష్మిక పెద్దగా ఎలివేట్ అవ్వలేదనే చెప్పాలి. ఉన్నంతలో బాగా పర్ఫామ్ చేసింది అనిపించుకుంది అంతవరకే. కానీ ఆ తరవాత సెట్స్ పైకి వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ రష్మికను మరింత ఫోకస్ లోకి తీసుకువచ్చింది. విజయ్ దేవరకొండ తో మరోసారి జోడీ కట్టడమే ఇక్కడ స్ట్రాంగ్ రీజన్.

 విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఎఫెక్ట్ రష్మికపై కూడా ఈజీగా పడుతుంది. ‘డియర్ కామ్రేడ్’ నుండి రిలీజవుతున్న ప్రతి విజువల్ కి అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో రష్మిక చుట్టూ మరింత స్టార్ డమ్ క్రియేట్ అవుతుంది.రష్మిక కరియర్ లో విజయ్ దేవరకొండ సరసన రెండేసి సినిమాలు పడి ఉండకపోతే ఎలా ఉండేదో చెప్పలేం కానీ, డెఫ్ఫినెట్ గా ఈ హీరోకి ఉన్న  క్రేజ్ రష్మికకి 100% కలిసొస్తుంది.