మరోసారి ట్రై చేయనున్న విజయ్ దేవరకొండ

Friday,January 25,2019 - 03:32 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘నోటా’ తో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినా మరోసారి కోలీవుడ్ లో లక్ చేసుకుందామనుకున్నాడు విజయ్ దేవరకొండ. ఓ డెబ్యూ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ హీరో, ప్రస్తుతం ఈ సినిమా డిస్కర్షన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ లాంటివి ప్రస్తుతానికి తెలీదు కానీ, ఆల్మోస్ట్ ఈ సినిమా ఒక బైక్ చుట్టూ తిరుగుతుందనే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ నుండి కానీ, పర్టికులర్ ఫిల్మ్ మేకర్స్ నుండి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రస్తుతానికి రాలేదు.

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కంప్లీట్ అయిన తరవాతే నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఫిక్స్డ్ రూల్ మెయిన్ టైన్ చేస్తున్న విజయ్, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా..? లేకపోతే ఈ టాక్ జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా అనేది చూడాలి.