1000 మంది డ్యాన్సర్స్ తో ‘సైరా’ సాంగ్

Friday,January 25,2019 - 02:50 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ‘సైరా’ సినిమా. ప్రస్తుతం సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాటను తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ సాంగ్ లో దాదాపు 1000 మంది డ్యాన్సర్స్ పాల్గొంటున్నారు. స్వాతంత్రానికి పూర్వం దేశంలో ఉండే పరిస్థితులు, సంస్కృతిని ఎలివేట్ చేసేలా ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది.

ఏ మాత్రం హడావిడి లేకుండా, సినిమాని హై స్టాండర్డ్స్ లో ప్రెజెంట్  చేసే ప్రాసెస్ లో ఉన్నారు. సినిమాలోని యాక్షన్ ఎలిమెంట్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న టీమ్, ప్రతి సన్నివేశాన్ని నెవర్ సీన్ బిఫోర్ స్థాయిలో  ఉంటుందని చెప్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుంది. తమన్నా సినిమాలో కీ రోల్ లో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు. అమిత్ త్రివేది సినిమాకి మ్యూజిక్ కంపోజర్. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.