విజయ్ దేవరకొండ ఈసారి సిక్స్ ప్యాక్?

Wednesday,August 14,2019 - 10:02 by Z_CLU

విజయ్ దేవరకొండ ఈసారి సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడా…? పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ లో రేజ్ అయిన క్వశ్చన్ ఇది. విజయ్ దేవరకొండ ప్లేస్ లో ఇంకో హీరో ఎవరైనా ఉంటే, ఈసారి పూరి మార్క్ తో కనిపిస్తాడు అనుకునేవాళ్ళేమో.. కానీ ఆల్రెడీ పూరి హీరోలా ఉండే విజయ్ దేవరకొండని ఇంకెలా చూపించబోతున్నాడు..? సిక్స్ ప్యాక్స్ లుక్స్ లోనా..?

పూరి హీరోల్లో ఉండే అగ్రెసివ్ నెస్ విజయ్ దేవరకొండ లో డీఫాల్ట్ గా ఉంది. పూరి హీరోలకుండే బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్, పూరితో సినిమా చేయకుండానే విజయ్ లో ఇదివరకే చూసేశాం… ఇక డిఫెరెంట్ డిక్షన్, డైలాగ్స్ డెలివరీ అంటారా..? ఆల్రెడీ విజయ్ దేవరకొండకి ఓ యూనిక్ స్టైల్ ఉంది… అలాంటప్పుడు పూరి ఏం చేయబోతున్నాడు..? అందుకే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ సిక్స్ ప్యాక్స్ లుక్స్ పై నిలిచింది.

విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ లో కనిపించలేదు. ఫ్యాన్స్ గెస్ నిజమైతే ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్స్ లో కనిపించే చాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.

ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా అనౌన్స్ చేశాడంటే పూరి ఆల్రెడీ ఈ క్రేజీ హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలో సగం ఫిక్సయ్యే ఉంటాడు. వాటికి ఈ సిక్స్ ప్యాక్ లుక్స్ కూడా బోనస్ గా చేరితే, ఫ్యాన్స్ కి పండగే పండగే.