100 కోట్లు వసూలు చేసిన F2 సినిమా

Friday,January 25,2019 - 04:38 by Z_CLU

సంక్రాంతి రేస్ లో విన్నర్ గా నిలబడటమే కాదు, ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది F2 సినిమా. సినిమాలో ఎమోషన్స్ సంగతేమో కానీ, టికెట్ కొన్న ప్రతి ఒక్కరిని కడుపు నిండా నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, 100 కోట్ల సినిమాని అందించడమే కాదు, 100% కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు.

సంక్రాంతి కి 2 భారీ సినిమాల మధ్య రిలీజైన ఈ సినిమా రిలీజ్ కి ముందే కామెడీ గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చింది. దానికి తోడు ఈ ఆన్ స్క్రీన్ తోడల్లుళ్ళ కెమిస్ట్రీ, ప్రతి ఫ్యామిలీకి జెన్యూన్ గా కనెక్ట్ అవ్వడంతో, ప్రతి ఒక్కరూ ఈ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వెంకీ ఇలాంటి న్యాచురల్ కామెడీ చేశాడు అనుకుంటే, వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కి  సరికొత్త సర్ ప్రైజ్ అనిపించుకుంది.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి అడిషనల్ గా మరో 5 సీన్స్ ని ఆడ్ చేస్తున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మించాడు ఈ సినిమాని. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్స్.