విజయ్ దేవరకొండ వస్తున్నాడు

Tuesday,August 20,2019 - 11:03 by Z_CLU

విజయ్ దేవరకొండ ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడంటే సినిమా చిన్నదైనా, పెద్దదైనా ఫోకస్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వరసలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా చేరబోతుంది. ఈ రోజు గ్రాండ్ గా జరగనున్న ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ఈ ఈవెంట్ లో విజయ్ స్పీచ్ ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతుంది. గతంలో అటెండ్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా తన స్థాయి మ్యాజిక్ చేశాడు విజయ్ దేవరకొండ.

దొరసాని : ఈ ఈవెంట్ లో ఫన్ ఉంటుందేమో అని ఎక్స్ పెక్ట్ చేశారంతా.. కానీ విజయ్ దేవరకొండలో ఎమోషనల్ ఆంగిల్ కూడా ఉంటుందని ఈ ఈవెంట్ తో తెలిసింది. ఈ సినిమా గురించి మాట్లాడటానికి వచ్చిన విజయ్, తన తమ్ముడితో అనుబంధాన్ని కూడా తెలిసేలా చేశాడు.

మహర్షి : విజయ్ దేవరకొండ మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్.. అందుకే మేకర్స్ ఇలా ఇన్వైట్ చేశారో లేదో అటెండ్ అయ్యాడు… అందునా స్టేజ్ పై ‘మహేష్ బాబుని ‘సార్’ అని పిలవడం అస్సలిష్టం లేదని, ఆయన నా సీనియర్ కాదు… అలా పిలవడానికి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని…’ అని తన అభిమానాన్ని చాటుకున్నాడు…

సూర్యకాంతం: నిజానికి ఈ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ అటెండ్ అవ్వాలి కానీ U.S. లో షూటింగ్ చేస్తుండటం వల్ల అటెండ్ అవ్వలేదు.. మరోవైపు రామ్ చరణ్, నాగబాబు కూడా బిజీగా ఉండటంతో, బాధ్యతగా ఫీల్ అయి ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు.. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పుకున్నాడు.

మరి ఈ రోజు… ఇన్స్ పైరింగ్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాడో…? ఈ క్రేజీ హీరో ప్రెజెన్స్ సినిమాపై ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చూస్తుందో… చూడాలి.