విజయ్ దేవరకొండ ఇలా...

Tuesday,July 09,2019 - 01:02 by Z_CLU

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ’దొరసాని’  సెట్స్ పైకి వచ్చినప్పుడు న్యాచురల్ గానే ఫోకస్ ఆ సినిమా పైకి మళ్ళింది. కానీ విజయ్ దేవరకొండ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు విజయ్ నుండి ఏ అప్డేట్ లేదు.. కనీసం టీజర్ రిలీజైనప్పుడు కూడా విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని పట్టించుకుంటున్నాడు అనే దాఖలాలు కనిపించలేదు… అలాంటిది ఫస్ట్ టైమ్ మాట్లాడాడు….

సినిమా ఇండస్ట్రీ అంటే జస్ట్ సినిమాలు తీయడం కాదు.. ట్రోల్.. అవ్వాలి.. అబ్యూజ్ అవ్వాలి.. అలాంటి పరిస్థితుల మధ్య కూడా స్ట్రాంగ్ గా నిలబడగలగాలి… అలా ఆనంద్ నిలబడగలిగినప్పుడే యాక్టర్ అవుతాడు… అందుకే నేను కనీసం ఆనంద్ కి ఏ రకంగా హెల్ప్ చేయలేదు…’ అని ఎమోషనల్ గా చెప్పుకున్నాడు విజయ్ దేవరకొండ…

సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను అని చెప్పుకున్నాడు విజయ్. ఒకవేళ సినిమా నచ్చకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాను అని ముందే తెగేసి చెప్పాడట. ఏది ఏమైనా సినిమా చూశాక విజయ్ ఒపీనియన్ మారింది అది వేరే విషయం అనుకోండి…

‘సినిమా చూసిన తరవాత నేను కూడా నా మొదటి సినిమాలో ఇంత బాగా పర్ఫామ్ చేయలేదేమో…’ అనిపించింది అని చెప్పుకున్న విజయ్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ ‘దొరసాని’ ప్రీ రిలీజ్ స్టేజ్ పై తమ్ముడితో ఉన్న బాండింగ్ ని షేర్ చేసుకున్నాడు.