మహేష్ బాబు ‘మహర్షి’ లో వెరీ వెరీ స్పెషల్

Monday,January 21,2019 - 12:39 by Z_CLU

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది మహేష్ బాబు ‘మహర్షి’. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలోని ప్రతి సీక్వెన్స్ ని నెవర్ సీన్ బిఫోర్ స్థాయిలో తెరకెక్కిస్తుంది టీమ్. అయితే వీటిలో అబూదాబి లో తెరకెక్కనున్న సీక్వెన్స్ సినిమాలో మరింత కీలకం కానుందని తెలుస్తుంది. అందుకే మేకర్స్ ఆల్మోస్ట్ అన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాకే, అబూదాబి షెడ్యూల్ పై ఫోకస్ పెట్టనున్నారు.

ప్రస్తుతం పొలాచి లో షూటింగ్ జరుపుకుంటున్న ‘మహర్షి’ టీమ్, ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా హైదరాబాద్  లో మరో భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారు. ఈ షెడ్యూల్ తరవాతే ‘అబూదాబి’ కి ప్రయాణం కానుంది సినిమా టీమ్. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు మహర్షి మేకర్స్.

మహేష్ బాబు 25 వ సినిమా అనగానే క్రియేట్ అయిన వైబ్స్ ని మరిన్ని రెట్లు రేజ్ చేసింది రీసెంట్ గా రిలీజ్ చేసిన మహర్షి సెకండ్ లుక్.  దాంతో ఈ సినిమా నుండి నెక్స్ట్ రిలీజ్ కానున్న అప్డేట్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ  ఫ్యాన్స్  లో  కనిపిస్తుంది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతుందీ సినిమా. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. దిల్ రాజు, అశ్విని దత్ మరియు PVP సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.