సోషల్ మీడియా సెన్సేషన్.. మిస్టర్ మజ్ను

Monday,January 21,2019 - 12:17 by Z_CLU

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన గంటకే మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సినిమా.. తాజాగా 24 గంటల్లో 5 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. అఖిల్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చెప్పకనే చెబుతోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. కోపంగా కోపంగా అనే లిరిక్స్ తో సాగే సాంగ్ బిట్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. SVCC బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.