ఒక్క కథనే మూడు సార్లు విన్న మెగాస్టార్

Monday,January 21,2019 - 01:23 by Z_CLU

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఫస్ట్ సినిమాకే వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడా…? వైబ్స్ చూస్తుంటే అదే జరగబోతుందనిపిస్తుంది. దానికి రీజన్ ఈ కథని మెగాస్టార్ ఓపిగ్గా దగ్గరుండి రెడీ చేయించడమే.

ఈ సినిమా లాంచ్ కార్యక్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ మాట్లాడుతూ, ఈ కథని చిరు 3 సార్లు విన్నారని చెప్పుకున్నాడు. విన్న ప్రతిసారి కథలో ఎక్కడ చిన్న తప్పు దొర్లినా, ఏ మాత్రం చాన్స్ తీసుకోకుండా తనకు తోచిన సలహా ఇచ్చి, స్క్రిప్ట్ 100% పర్ఫెక్ట్ అనిపించాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట మెగాస్టార్. స్క్రిప్ట్ కి ఆ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టే, ఆయన ఆ స్థాయిలో ఉన్నారని చెప్పుకున్న సుకుమార్, ఈ కథ వైష్ణవ్ తేజ్ డెబ్యూ కి పర్ఫెక్ట్ చాయిస్ అన్నాడు.

లాంఛనంగా జరిగిన ఈ వేడుకలో నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సానా బుచ్చిబాబుకు స్క్రిప్ట్ ని అందించారు. మెగాస్టార్ క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్చాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.