'మహర్షి' టాప్ 5 ఎట్రాక్షన్స్

Wednesday,May 08,2019 - 11:06 by Z_CLU

‘మహర్షి’ ఆలోచింపజేసే సినిమా అవుతుంది అంటున్నారు మేకర్స్. మహేష్ బాబు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఫ్యాన్స్ ‘మహర్షి’ ని ఎప్పుడెప్పుడు చూస్తామా..? అనే స్థాయిలో ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ సినిమాలో  5 ఉన్నాయి… అవేంటంటే…

 

మహేష్ బాబు : ఫస్ట్ ఎవర్ ఎట్రాక్షన్. అందునా ఇది 25 వ సినిమా. ఇమేజ్.. ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ మైండ్ లో పెట్టుకునే ‘మహర్షి’ ని ఫిక్సయ్యాడు మహేష్ బాబు. అందునా మహేష్ బాబు లుక్స్ కి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

మహేష్ 3 గెటప్స్ : ఒక్క కాలేజ్ ఎపిసోడే 45 మినిట్స్ ఉంటుంది సినిమాలో. యంగ్ అండ్ అగ్రెసివ్ మహేష్ బాబు అక్కడి నుండి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ట్రాన్స్ ఫామ్ అవ్వడం అద్భుతంగా ఉండబోతుందనిపిస్తుంది. ఈ లుక్స్ లో ఇప్పటికే మహేష్ బాబు అదిరిపోయాడు. ఇక సినిమాలో కీలకమైన ఎపిసోడ్.. మహేష్ బాబు రైతుగా ఇప్పటికే పోస్టర్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై ఆ మ్యాజికల్ మూమెంట్స్ క్రియేట్ చేసే వైబ్స్ ని ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే.

స్టోరీ లైన్ – ఇప్పటివరకు రైతుల సమస్యలపై సినిమాలు రాలేదని చెప్పలేం కానీ, మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇలాంటి సినిమా రావడం మాత్రం ఫస్ట్ టైం. ఒక సక్సెస్ ఫుల్ పర్సన్ రైతు గొప్పతనాన్ని రియలైజ్ అవ్వడమన్నది యూనిక్ పాయింటే.

నిర్మాతలు –  ఏకంగా ముగ్గురు నిర్మాతలు నిర్మించిన సినిమా ‘మహర్షి’. దిల్ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ V. పొట్లూరి సంయుక్తంగా ఇష్టపడి తీసిన సినిమా ఇది. ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్స్.

వంశీ పైడిపల్లి : ఈ కథని మహేష్ బాబు కోసమే రాసుకున్నాడు. ‘ఊపిరి’ తరవాత ఆల్మోస్ట్ రెండేళ్ళు జస్ట్ స్క్రిప్ట్ పైనే పని చేశాడు. వంశీ పైడిపల్లి కథలో మ్యాజిక్ చేసేవే సెన్సిబిలిటీస్. ‘మహర్షి’ లో అవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. రేపు జస్ట్ ‘మహర్షి’ జర్నీ ఒక్కటే రివీల్ అవ్వదు.. వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో గత మూడేళ్ళుగా కన్న కల కూడా స్క్రీన్ పై ఎలివేట్ అవుతుంది.