వంశీ చెప్పినట్టే జరిగింది - మహేష్ బాబు

Sunday,May 12,2019 - 04:09 by Z_CLU

‘మహర్షి’ సూపర్ హిట్టయింది. మహేష్ బాబు 25 వ సినిమాని ఎంతో గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఆడియెన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని ఈజీగా రీచ్ అయింది ఈ సినిమా. అందుకే సినిమా టీమ్ ఈ రోజు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో మహేష్ బాబు ఎమోషనల్ గా మాట్లాడాడు.

‘ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ గర్వంగా కాలర్ ఎగరేసే సినిమా ‘మహర్షి’ అవుతుందని చెప్పాడు. నా ఫ్యాన్సే కాదు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నా. ఆ స్థాయిలో సంతృప్తినిచ్చింది ఈ సక్సెస్. వంశీ చెప్పినట్టే జరిగింది’. అని చెప్పాడు మహేష్ బాబు.

దీంతో పాటు సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ ని పేరు పేరునా అభినందించాడు సూపర్ స్టార్. మరీ ముఖ్యంగా అల్లరి నరేష్ ని రవి రోల్ ప్లే చేసినందుకు ప్రత్యేకంగా అభినందించాడు.