ట్విట్టర్ టాప్-5లో మహర్షి

Wednesday,December 11,2019 - 10:02 by Z_CLU

ట్విట్టర్ లో ట్రెండింగ్ అనేది చాలా కామన్. ప్రతి రోజూ ఏదో ఒక విషయం ట్రెండ్ అవుతుంటుంది. దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. కానీ ఏడాది మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అద్భుతంగా ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి కోట్లాది హ్యాష్ ట్యాగ్స్ లోంచి రెండు సౌత్ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి.

2019 టాప్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో అజిత్ నటించిన విశ్వాసం సినిమా నిలిచింది. #Viswasam అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగానే కాకుండా, వరల్డ్ వైడ్ ట్రెండ్ అయింది. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా టాప్ ట్రెండింగ్స్ లో నిలిచింది. టాప్-5 లిస్ట్ లో #Maharshi నాలుగో స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి కేవలం మహేష్, అజిత్ సినిమా టైటిల్స్ మాత్రమే ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బాలీవుడ్ నుంచి ఒక్క సినిమా టైటిల్ కూడా టాప్-5 ట్రెండింగ్ లిస్ట్ లో లేకపోవడం.

అటు మహేష్ బాబు టాప్-10 ఎంటర్ టైనింగ్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఒకడిగా కూడా నిలిచాడు. టాలీవుడ్ నుంచి మరే హీరోకు ఈ లిస్ట్ లో స్థానం దక్కలేదు. మొదటి స్థానంలో అమితాబ్ బచ్చన్ నిలవగా.. హీరో విజయ్ ఐదో స్థానంలో, మహేష్ 9వ స్థానంలో నిలిచారు.