ఇకపై మహేష్ బాబు ట్రేడ్ మార్క్ ఇదే

Friday,May 17,2019 - 10:05 by Z_CLU

నందమూరి హీరోలు తొడగొడతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కాలర్ ఎగరేస్తాడు… మొదటిది టాలీవుడ్ లో ఎంత కామనో, ఇప్పుడు రెండోది కూడా అంతే కామన్ మ్యానరిజం కాబోతుందా..? ఇకనుండి కాలర్ ఎగరేసే స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని సక్సెస్ ని రేట్ చేస్తారా…?

ఈ కాలర్ సీజన్ ని నిజానికి మహేష్ బాబు స్టార్ట్ చేయలేదు. దర్శకుడు వక్కంతం వంశీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విత్తనాన్ని చిన్నగా నాటి వదిలేశాడు. అది కాస్త ఇప్పుడు ట్రేడ్ మార్క్ అయ్యే స్థాయిలో ఎదుగుతుందనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టేజ్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు వంశీ. సినిమా సక్సెస్ తరవాత ఆయన మాటకి కొనసాగింపుగా  మహేష్ బాబు కాలర్ ఎగరేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. అంతటితో ఆగలేదు.

 

రీసెంట్ గా సినిమా సక్సెస్ మీట్ లో కూడా కాలర్ ఎగరేశాడు మహేష్ బాబు. ఈ గెస్చర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ మహేష్ బాబు ఈ కొత్త మ్యానరిజాన్ని కూడా అంతే గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 18 న జరగనున్న గ్రాండ్ సక్సెస్ మీట్ లో కూడా మహేష్ బాబు ఇలాగే కాలర్ ఎగరేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అదే గనక జరిగితే అనుమానం లేదు. మహేష్ బాబు కొత్తగా ఫాలో అవుతున్న ఈ గెస్చర్  అభిమానులకు  ఓ బ్రాండ్ అయిపోవడం ఖాయం.