వెంకీ టైటిల్ తో ....

Saturday,February 25,2017 - 02:28 by Z_CLU

లేటెస్ట్ గా ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి హిట్ అందుకొని జోరు మీదున్న యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు… చంద్ర మోహన్ దర్శకత్వం లో యాక్షన్ & కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలే ‘రాధ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు యూనిట్.

శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి ఈ టైటిల్  మారుతే సజెస్ట్ చేసాడనే వార్త కూడా వినిపిస్తుంది..

 అప్పట్లో విక్టరీ వెంకటేష్ మారుతీ దర్శకత్వం లో ఈ టైటిల్ తో ఓ సినిమాను స్టార్ట్ చేసి ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే టైటిల్ తో వెంకీ మరో సినిమా చేస్తాడనే వార్త కూడా అప్పట్లో వినిపించింది. కానీ ఇప్పుడిదే టైటిల్ ని శర్వా ఫిక్స్ చేసుకోవడం తో ఇక వెంకీ ఈ టైటిల్ ని వదులుకున్నట్టే అనే విషయం కన్ఫర్మ్ అయింది.