Prabhas Maruthi - ప్రభాస్-మారుతి సినిమా సంగతేంటి?

Friday,October 28,2022 - 03:06 by Z_CLU

Prabhas Completed first Schedule of Maruthi’s Movie

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-K (Project K) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ (Salaar) ప్రాజెక్ట్ చేస్తున్నాడు. చాలామంది ఈ 2 మాత్రమే అనుకుంటున్నారు. కానీ సైలెంట్ గా మారుతి సినిమాను కూడా పట్టాలపైకి తీసుకొచ్చాడు ప్రభాస్.

మారుతి-ప్రభాస్ (Maruthi-Prabhas) కాంబోలో సినిమా వస్తోంది. దీనికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే ప్రభాస్ పై టెస్ట్ కట్, ఫొటో షూట్ నిర్వహించారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తీశారు. ప్రభాస్ తో పాటు ఇద్దరు హీరోయిన్లు, వైవా హర్ష లాంటి కమెడియన్లు ఈ సన్నివేశాల్లో నటించారు.

ఆ తర్వాత ప్రభాస్ లేకుండా, మరో 3 రోజుల పాటు ఇతర నటీనటులపై మరికొన్ని సీన్స్ తీశారు. అలా ఫస్ట్ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పారు. సెకెండ్ షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తారు. మారుతి సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్, వెంటనే సలార్ షెడ్యూల్ జాయిన్ అయ్యాడు.

మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ (Adipurush) సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలు వచ్చింది. ప్రస్తుతం ఈ రన్ టైమ్ ను తగ్గించే పనిలో దర్శకుడు ఓం రౌత్ బిజీగా ఉన్నాడు. కనీసం 25 నిమిషాలు తగ్గించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.