మహేష్ లేట్... కారణం అదే....

Saturday,February 25,2017 - 01:23 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్,మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సమ్మర్ నుంచి తప్పుకుంది. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుందని ఇప్పటి వరకూ యూనిట్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ మహేష్ ఈ సినిమాతో కచ్చితంగా సమ్మర్ కె వస్తాడనుకున్నారంతా…

మొన్నటి వరకూ ఈ సినిమా సమ్మర్ బరిలో నిలుస్తుందనుకున్న ఫాన్స్ కి ఇటీవలే జూన్ 23న మహేష్ థియేటర్స్ లోకి రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు మురుగదాస్.. అయితే ముందుగా ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న యూనిట్ షూటింగ్ బాలన్స్ ఉండటం పైగా పోస్ట్ ప్రొడక్షన్ కి కాస్త ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటుండంతో జూన్ కి ఫిక్స్ అయ్యారట..అంటే మహేష్ సమ్మర్ నుంచి మాన్సూన్ కి తన సినిమాను షిఫ్ట్ చేసుకున్నాడన్నమాట.. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించిన లుక్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్న మేకర్స్ త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలనిచూస్తున్నారు.