'బాహుబలి-2 ' ట్రైలర్ రెడీ.....

Saturday,February 25,2017 - 04:04 by Z_CLU

టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇంటెర్నేష్నల్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘బాహుబలి ది కంక్లూజన్’… ఇప్పటికే ‘బాహుబలి’  ది ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పార్ట్2 పై భారీ   అంచనాలే  నెలకొన్నాయి.. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ కేవలం రెండు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన యూనిట్ త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు..

ట్రైలర్ రిలీజ్ డేట్ పై ప్రేక్షకులకున్న డౌట్స్ కి లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి… ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో జక్కన్న మాట్లాడుతూ ” నిజానికి ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉంది. ట్రైలర్ కట్టింగ్ అయిపోయింది.. కానీ దాని తాలూకా సి.జీ షాట్స్ రావాల్సి ఉంది.. ఆ సి.జీ వర్క్ అయిపోయాక దానికి డి.ఐ, సౌండ్ ఫిక్స్ చేయడానికి ఇంకాస్త టైం పడుతుంది.. అందుకే డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాం….డేట్ అయితే ఇంకా అనుకోలేదు కానీ మార్చ్ మిడిల్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.” అంటూ   తెలిపాడు. అంటే సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల ముందు ఈ ట్రైలర్ తో సినిమా పై మరింత  హైప్ క్రియేట్ చేయబోతున్నాడన్నమాట జక్కన.