వెంకీ, చైతూ హీరోలుగా కల్యాణ్ కృష్ణ సినిమా

Monday,September 11,2017 - 12:35 by Z_CLU

వరుసగా రెండు హిట్స్ కొట్టిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశాడు. అది కూడా వెరీ వెరీ స్పెషల్ మూవీతో కావడం విశేషం. ఈసారి మల్టీస్టారర్ ప్రాజెక్టును సెలక్ట్ చేసుకున్నాడు కల్యాణ్ కృష్ణ. ఇందులో వెంకటేష్, చైతూ హీరోలుగా నటించబోతున్నారు. ప్రస్తుతం దర్శకుడు, హీరోల మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్టోరీలైన్ హీరోలిద్దరికీ నచ్చింది.

సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు కల్యాణ్ కృష్ణ. ఈసారి తన మూడో ప్రయత్నంగా వెంకటేష్ కు కథ వినిపించాడు. ఇందులో మరో పాత్ర కోసం చైతూ అయితే బాగుంటుందని స్వయంగా వెంకటేష్ సూచించాడట. అలా ఈ ప్రాజెక్టు ఓకే అయింది.

ఇప్పటికిప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేయడానికి వెంకీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాగచైతన్య డేట్స్ దొరకడమే కష్టం. ఎందుకంటే సెప్టెంబర్ 20 నుంచి సవ్యసాచి సినిమా ప్రారంభించబోతున్నాడు చైతూ. ఆ తర్వాత సమంతతో వివాహం ఉంది. ఈ టైమ్ లో కల్యాణ్ కృష్ణ సినిమాకు చైతూ ఎప్పట్నుంచి డేట్స్ ఇస్తాడో చూడాలి. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో ఓ అతిథి పాత్రలో మెరిసిన వెంకటేష్.. ఇప్పుడు చైతూతో కలిసి ఏకంగా మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నాడన్నమాట.