డిసెంబర్ 13 నుంచి తేజ-వెంకీ సినిమా

Monday,November 27,2017 - 11:28 by Z_CLU

మొన్నటివరకు వినిపించిన రూమరే ఇది. కాకపోతే ఇప్పుడు పక్కా అయింది. అవును.. వెంకీ సినిమాను వచ్చేనెల 13న ప్రారంభించబోతున్నట్టు తేజ కన్ ఫర్మ్ చేశాడు. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు. సినిమా ప్రారంభించడానికి అంతకంటే మంచి టైం ఇంకేముంటుందని ప్రశ్నిస్తున్నాడు ఈ దర్శకుడు. అంతేకాదు.. కేవలం ప్రారంభోత్సవం మాత్రమే కాకుండా.. ఆ రోజు నుంచే మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుందని ప్రకటించాడు తేజ.

తేజ-వెంకీ కాంబోలో రాబోతున్న సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో గుబురు గడ్డంతో ఒకసారి, క్లీన్ షేవ్ లో మరోసారి… ఇలా 2 డిఫరెంట్ గెటప్స్ లో వెంకీ కనిపిస్తాడని తెలుస్తోంది. అంటే.. మూవీలో కచ్చితంగా ఓ రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు వెంకీ ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తాడనే పుకార్లకు ఈ గడ్డం మేకోవర్ బాగా సింక్ అవ్వడం పుకార్లు పెరిగిపోయాయి.

మూవీకి సంబంధించి తేజ ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై చర్చలు సాగుతున్నాయి. గురు సినిమా తర్వాత వెంకీ నుంచి వస్తున్న మూవీ ఇదే.