ఈ వారమే రిలీజ్ కానున్న కథలో రాజకుమారి

Monday,September 11,2017 - 01:17 by Z_CLU

నారా రోహిత్ కథలో రాజకుమారి సెప్టెంబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నమితా ప్రమోద్, నందితా రాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాగశౌర్య కామియో రోల్ లో ఎట్రాక్ట్ చేయనున్నాడు. గతంలో ఇంటరెస్టింగ్ ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ క్లియర్ చేసుకుని క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.

మహేష్ సూరపనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో 2 సాంగ్స్ ని మాస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేస్తే, తక్కిన పాటలను విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాని సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణ విజరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.