అర్జున్ రెడ్డి హీరోయిన్ కు క్రేజీ ఆఫర్

Monday,September 11,2017 - 12:01 by Z_CLU

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది హీరోయిన్ షాలిని పాండే. థియేటర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన ఈ భామ.. నటనకు ప్రాధాన్యం కలిగిన పాత్రలు మాత్రమే చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. గ్లామర్ రోల్స్ కంటే యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రలే తనకు ఇష్టమని చెప్పిన ఈ భామ, ఇప్పుడు ఆ దిశగా ఓ అడుగు వేసింది. క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న మహానటిలో షాలిని పాండేను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది మహానటి సినిమా. కీర్తిసురేష్ ఇందులో ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది. మరో కీలక పాత్రలో సమంత కూడా కనిపించనుంది. ఇప్పుడు ఈ మెగా వెంచర్ లోకి షాలిని కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి షాలిని ఎంట్రీ చర్చల దశలోనే ఉంది. దర్శకుడు నాగ్ ఆశ్విన్ ఓ మంచి పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే మహానటి సినిమాలో షాలిని పాత్ర ఏంటి.. అది ఎంత మేర సినిమాలో కనిపించనుంది లాంటి అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.