ఈ సంక్రాంతి సీనియర్లదే

Wednesday,October 19,2016 - 12:29 by Z_CLU

ఈ సారి సంక్రాంతి సం థింగ్ స్పెషల్ కానుంది. కొత్త జనరేషన్ సరికొత్త కాన్సెప్ట్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచేస్తే, ఆ స్పీడ్ కి మరింత ఊపుని జోడించి దూసుకొస్తున్నారు సీనియర్ హీరోలు. ఈ సంక్రాంతికి క్యూ కట్టిన సీనియర్ హీరోల సినిమాలు చూస్తుంటే బడా కోడిపుంజులే బరిలోకి దిగిన ఫీలింగ్ కలుగుతుంది..

collage-123

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ ఖైదీ నం 150 భోగి రోజున రిలీజవుతుంటే సరిగ్గా సంక్రాంతి రోజు దూసుకొస్తున్నాడు గౌతమీపుత్ర శాతకర్ణీ బాలకృష్ణ. ఇక మొన్నటికి మొన్నషూటింగ్ మొదలుపెట్టిన వెంకటేష్ “గురు” సినిమా కూడా తాజాగ సంక్రాంతి రేసులోకి దూకింది. దీపావళికి టీజర్ రిలీజ్ చేసి, సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందేనని అల్టిమేటం పాస్ చేశాడట వెంకీ. భోగి, సంక్రాంతి తరవాత మిగిలింది కనుమేగా.. కాబట్టి వెంకీ సినిమా కనుమకే వచ్చే అవకాశాలున్నాయి లేదంటే… బాలయ్య, చిరు సినిమాలకు కొన్ని రోజుల ముందైనా థియేటర్లలోకి రావొచ్చు. మొత్తమ్మీద ఈ సంక్రాంతి మాత్రం సీనియర్లదే.