వెంకీ, తేజ సినిమా ప్రారంభం

Monday,December 04,2017 - 12:13 by Z_CLU

తేజ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో లాంఛనంగా జరిగాయి. హీరో వెంకటేష్ తో పాటు పరుచూరి బ్రదర్స్, సురేష్ బాబు రానా, అనిల్ సుంకర, రాజా రవీంద్ర,  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మూవీకి సంబంధించి హీరోయిన్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. మిగతా టెక్నీషియన్ల వివరాల్ని కూడా త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. గురు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేశ్.. ఎన్నో కథలు విన్న తర్వాత తేజ చెప్పిన స్టోరీలైన్ కు ఓకే చెప్పాడు.

తేజ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో వెంకటేష్ కనిపిస్తాడనే రూమర్ వినిపిస్తోంది. ఓ పాత్రలో ప్రొఫెసర్ గా కనిపిస్తాడట వెంకీ. నిజానికి ఈ సినిమాను వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 13న లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ బర్త్ డేను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లబోతున్నాడు వెంకీ. అందుకే ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.