వెంకీతో గుణశేఖర్ సినిమా ?

Sunday,August 27,2017 - 10:13 by Z_CLU

ఇటీవలే ‘గురు’గా థియేటర్స్ కి సందడి చేసిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు.. అయితే లేటెస్ట్ గా వెంకీ గుణ శేఖర్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది.. ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గుణ శేఖర్ లేటెస్ట్ గా ఓ హిస్టారికల్ స్క్రిప్ట్ రెడీ చేసి తాజాగా వెంకీ కి వినిపించాడని వెంకీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం వెంకీ -గుణ శేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుందని, త్వరలోనే ఈ కాంబినేషన్ లో భారీ గా రూపొందే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. ప్రస్తుతం వార్తగానే ఉన్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే ఇక కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్ గా మెప్పించి ఆ తర్వాత వయసుకు సరిపడే పాత్రలతో ఎంటర్టైన్ చేసిన వెంకీ మరో కొత్త తరహా పాత్రతో అందరినీ మెస్మరైజ్ చేయడం ఖాయం..