రూట్ మార్చిన కళ్యాణ్ రామ్

Sunday,August 27,2017 - 11:06 by Z_CLU

పటాస్ తో ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘MLA’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఉపేంద్ర దర్శకత్వంలో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సారి స్టార్ హీరోయిన్ కాజల్ తో జత కట్టిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాలో కూడా మరో స్టార్ హీరోయిన్ తో కలిసి ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

ప్రెజెంట్ MLA సినిమాతో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాను జయంత్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నాతో జోడి కట్టి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నందమూరి హీరో. మొన్నటి వరకూ ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ తో పాటు కొత్త హీరోయిన్స్ తో మాత్రమే సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ మార్చి నెక్స్ట్ సినిమాలలో స్టార్ హీరోయిన్స్ తో కలిసి థియేటర్స్ లో సందడి చేయబోతున్నడన్నమాట.