ట్రైలర్ తో సందడి చేస్తున్న 'మేడ మీద అబ్బాయి'

Sunday,August 27,2017 - 09:36 by Z_CLU

అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేడమీద అబ్బాయి’ ప్రెజెంట్ ట్రైలర్ తో సోషల్ మీడియా లో సందడి చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రజీత్ దర్శకత్వం వహించాడు. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్ నిర్మిస్తున్నఈ సినిమాలో నరేష్ సరసన నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 8 న థియేటర్స్ లోకి రానుంది. మరి ఈ రీమేక్ తో అల్లరోడు ఎలాంటి హిట్ అందుకుంటాడో.