బ్యాక్ టు ఫామ్ అంటున్న త్రిష

Wednesday,February 22,2017 - 05:58 by Z_CLU

స్లో పేజ్ లో నడుస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం, తెలుగులో త్రిష బ్యాగ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా, తమిళంలో చేతి నిండా సినిమాలతో ఏ మాత్రం టైం లేకుండా బిజీ బిజీగా ఉంది త్రిష. అయితే త్రిష అకౌంట్ లో ఇప్పటి వరకు స్పేస్ క్రియేట్ చేసుకున్న సినిమాలు ఒక ఎత్తు. చియాన్ విక్రమ్ సామి 2 లో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అవ్వడం ఇంకో ఎత్తు.

2003 లో రిలీజైన సామి త్రిష కరియర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సక్సెస్ ఫుల్ పెయిర్ క్రియేట్ చేసిన ఫీవర్ కొన్నాళ్ళపాటు మొత్తం సౌత్ ఇండియానే షేక్ చేసింది, అలాంటిది మళ్ళీ విక్రమ్, త్రిష సామి2 లో జత కడుతున్నారనే కన్ఫర్మేషన్ న్యాచురల్ గానే సోషల్ మీడియాలో హీట్ ని జెనెరేట్ చేస్తుంది. ఈ సినిమాలో త్రిష బ్రాహ్మణ అమ్మాయిగా కనిపిస్తూనే తన సిజిలింగ్ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయనుంది.

 

ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాతో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.