నాని నెక్స్ట్ సినిమా రెడీ

Wednesday,February 22,2017 - 04:51 by Z_CLU

నాని నెక్స్ట్ సినిమా అప్పుడే హంగామా చేయడానికి రెడీ అయిపోయింది. మొన్నటికి మొన్న ఫస్ట్ షెడ్యూల్ కోసం U.S. వెళ్ళిన నాని, మార్చి 10 వరకు రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉంటాడు. ఈ లోపు అవుట్ స్టాండింగ్ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని ప్రిపేర్ చేసేసుకుంది సినిమా యూనిట్. అంతలో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేసింది.

మహా శివరాత్రి కావడం, అందునా నాని బర్త్ డే అవ్వడంతో ఈ రెండు అకేషన్ లను మైండ్ లో పెట్టుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, టైటిల్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. సూపర్ హిట్ తప్ప తన బ్యాగ్ లో ఇంకో టాక్ కి స్పేస్ లేకుండా మ్యానేజ్ చేసుకుంటున్న నాని కరియర్ లో ఈ సినిమా కూడా హ్యూజ్ స్పేస్ ఆక్యుపై చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

 

నాని , నివేద థామస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ డైరెక్టర్. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.