మహేష్, బన్నీ మధ్య సంక్రాంతి వార్

Wednesday,May 24,2017 - 10:22 by Z_CLU

రెండూ డిఫరెంట్ సినిమాలు. పేర్లు కూడా వెరైటీగా పెట్టారు. కథలో క్యారెక్టర్లు కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఇప్పుడా రెండు సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. అవే మహేష్, బన్నీ కమిట్ అయిన కొత్త సినిమాలు. ఈ రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంలో పోటీ ఫిక్స్ అయింది.

కొరటాల-మహేష్ మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాకు “భరత్ అనే నేను” అనే టైటిల్ పెట్టారు. వచ్చేనెల 16 నుంచి మహేష్ సెట్స్ పైకి వస్తాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

అటు బన్నీ కొత్త సినిమా కూడా సంక్రాంతికే వస్తోంది. డీజే వర్క్ పూర్తవ్వగానే, వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్ చేస్తాడు బన్నీ. ఈ సినిమాకు “నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా” అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.