`అంధ‌గాడు` ట్రైల‌ర్‌ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్

Monday,May 22,2017 - 07:00 by Z_CLU

రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు`గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ట్రెండ్ అయ్యింది. ఒక రోజులోనే ఈ ట్రైల‌ర్ .. 10లక్షల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. ఇప్ప‌టికే రెండు సూప‌ర్‌హిట్ చిత్రాల్లో జ‌త క‌ట్టిన రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్ జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు.

రాజ్ తరుణ్-హెబ్బా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌పీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుందంటోది యూనిట్. ఈ సినిమా జూన్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.