మహేష్, కొరటాల మూవీ అప్ డేట్స్

Tuesday,May 23,2017 - 11:00 by Z_CLU

ఓ వైపు స్పైడర్ సినిమా నడుస్తుండగానే మరోవైపు కొరటాల శివ-మహేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా నిన్ననే రెగ్యులర్ షూట్ మోడ్ లోకి ఎంటరైంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, మహేష్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కించారట. హైదారాబాద్ లోని ఓ రిచ్ బంగ్లాలో ఈ సన్నివేశాల్ని పిక్చరైజ్ చేసినట్టు తెలుస్తోంది.

మహేష్-కొరటాల సినిమా ఫస్ట్ షెడ్యూల్ మరో 4 రోజుల పాటు ఉంటుంది. సెకెండ్ షెడ్యూల్ జూన్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ నుంచే మహేష్ బాబు జాయిన్ అవుతాడు. కైరా అద్వానీ కూడా ఈ షెడ్యూల్ నుంచే సెట్స్ పైకి వస్తుందట. భరత్ అనే నేను అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు ఈ సినిమాకు.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 11న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాక సంగీత దర్శకుడు. ప్రస్తుతం నడుస్తున్న పుకార్ల ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడట.