టైటిల్ కూడా ఫిక్సయింది

Wednesday,February 22,2017 - 07:02 by Z_CLU

శతమానం భవతి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని సతీష్ వేగేశ్న అకౌంట్ లో వేసిన బ్రాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఈ డైరెక్టర్ తో ఇంకో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి ‘శ్రీనివాస కళ్యాణం’ అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేశారు.

టైటిల్ ని, ప్రొడ్యూసర్ ని కాస్త సైడ్ కి పెడితే లాస్ట్ వీక్ వరకు సతీష్ వేగేశ్న నాగార్జునతో ఓ స్టోరీ డిస్కస్ చేశాడన్న టాక్ రౌండ్స్ కొట్టింది. ఆ తరవాత ఈ విషయంలో ఎటువంటి అప్ డేట్స్ పెద్దగా బయటికి రాలేదు. అంతలో ఈ న్యూస్ బయటికి వచ్చేసరికి, సతీష వేగేశ్న నాగార్జునకి చెప్పిన స్టోరీ లైన్, ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో కన్ఫం అయిన స్టోరీ లైన్ ఒకటే అయి ఉంటుందన్న ఒపీనియన్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే మరో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా యాక్షన్ మోడ్ లోకి వచ్చేసినట్టే. మొత్తానికి స్టోరీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఫిక్స్ అయిపోయిన ఈ సినిమాలో లీడ్ కాస్ట్ దగ్గర్నించి, మెయిన్ టెక్నీషియన్స్ వరకు అన్ని డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.