సంక్రాంతికి బరిలో ఇంకెవరెవరు..?

Friday,July 12,2019 - 02:15 by Z_CLU

ఈసారి సంక్రాంతి మరింత కలర్ ఫుల్ కానుంది. కనీసం దసరా కూడా దాటకముందే సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకున్న సినిమాల అంకె రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సినిమాల మధ్య కాంపిటీషన్ అనుకోకపోయినా, రానున్న ఈ సంక్రాంతికి ఆడియెన్స్ కి మాత్రం కావాల్సినన్ని సినిమాలు ఆప్షన్స్ కాబోతున్నాయి.

బాలయ్య కొత్త సినిమా సంక్రాంతికే. ఈ విషయం అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికే. ఈ 2 సినిమాలతో పాటు శర్వా ‘శ్రీకారం’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుంది.

ఇంకా సెట్స్ పైకి రాలేదు కానీ నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి సరిపడా ఎంటర్ టైన్ మెంట్ ఫిక్సయింది అనుకునేలోపు బన్ని, త్రివిక్రమ్ ల సినిమా కూడా సంక్రాంతి పండక్కే అని కన్ఫమ్ చేశారు.

ఇప్పటికే 5 సినిమాలు… ప్రతీది దేనికదే స్పెషల్. అలాగని పండక్కి వచ్చేది ఈ సినిమాలే అని ఫిక్సవ్వడానికి లేదు. ఈ వరసలో పండగ దగ్గరపడే నాటికీ ఇంకెన్ని సినిమాలు చేరతాయో చూడాలి.