బన్ని సినిమా సంక్రాంతికే... కన్ఫమ్

Wednesday,July 10,2019 - 05:36 by Z_CLU

అల్లు అర్జున్ కొత్త సినిమా వచ్చేది సంక్రాంతికే. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాతి బరిలోకి దిగడానికి రెడీ అవుతుంది.

 

బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది 3 వ సినిమా. అందుకే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.  దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ బన్నిని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో టబూ, అల్లు అర్జున్ కి తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.