తమన్ బన్నికోసం ఏం చేస్తున్నాడు..?

Friday,June 28,2019 - 10:02 by Z_CLU

బన్ని, త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు తమన్. అందుకే సినిమాపై ఎన్నేసి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో, సినిమా సాంగ్స్ పై కూడా అవే రేంజ్ అంచనాలున్నాయి. గతంలో తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన బన్ని సినిమాలు ‘సరైనోడు’, ‘రేసుగుర్రం’ ఆడియో కూడా బ్లాక్ బస్టరే… ఈ లెక్కన తమన్ ఈ సినిమాకు ఆ స్టాండర్డ్స్ నే మెయిన్ టైన్ చేస్తున్నాడా..?

పక్కా ఫామ్ లో ఉన్నాడు తమన్. సినిమాల్లో జస్ట్ ట్యూన్స్ నే కాదు… సరికొత్త సౌండ్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఇన్స్ట్రు మెంట్స్ దగ్గరి నుండి ప్రతీది కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. తమన్ సాంగ్స్ అంటేనే డిఫెరెంట్ గ ఆన్తాయి అనే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా ఆడియోపై రోజు రోజుకి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

రీసెంట్ గా త్రివిక్రమ్ తో ‘అరవిందసమేత’ కి సాంగ్స్ కంపోజ్ చేశాడు తమన్. సినిమా రిలీజ్ కన్నా ముందే ఆడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కూడా అదే స్థాయిలో తమన్ సాంగ్స్ ఎసెట్ అవుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియెన్స్.

చూడాలి మరీ… తమన్ ప్రతిసారి లాగే ఈసారి కూడా అబన్ని కోసం ఏదైనా స్పెషల్ ట్యూన్స్ ప్లాన్ చేసుకున్నాడా..?  ఈ కాంబినేషన్ మరోసారి సక్సెస్ ఫుల్ అనిపించుకుంటుందా..? ఓ సారి ఆడియో రిలీజైతే తెలిసిపోతుంది.