ఇస్మార్ట్ శంకర్ ట్రయిలర్-2.. మరింత మాస్ గా..

Friday,July 12,2019 - 05:32 by Z_CLU

ఆడియన్స్ అంతా ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మాయలో పడిపోయారు. మొదటి ట్రయిలర్ కే ఫిదా అయి, యూట్యూబ్ లో మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంతలోనే పూరి జగన్నాధ్ మరో పండగ తీసుకొచ్చాడు. సినిమాకు సంబంధించి సెకెండ్ ట్రయిలర్ రిలీజ్ చేశాడు.

నిజానికి మొన్న రిలీజైన థియేట్రికల్ ట్రయిలర్ తోనే అంతా అయిపోయిందనుకున్నారు ఆడియన్స్. రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే మరో ట్రయిలర్ కట్ రావడంతో రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మొదటి ట్రయిలర్ లోనే ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక రెండో ట్రయిలర్ విషయానికొస్తే అంతకుమించి అన్నట్టుంది. రామ్ మేనరిజమ్, నబా నటేష్ యాక్టింగ్, నిధి అగర్వాల్ గ్లామర్ రెండో ట్రయిలర్ లో హైలెట్స్.

18న థియేటర్లలోకి వస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్. పూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాపై మార్కెట్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే.. పూరి-రామ్ కలిసి గట్టిగా కొట్టేట్టున్నారు.