క్యూట్ ఆన్ స్క్రీన్ కపుల్ – ఈ మధ్య కాలంలో వీళ్ళే...

Friday,July 12,2019 - 12:06 by Z_CLU

ఓ సినిమా సక్సెస్ అయితే న్యాచురల్ గానే లీడ్ రోల్స్ చుట్టూ క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే కొన్ని సార్లు ఆ క్రేజ్ ఆన్ స్క్రీన్ జోడీల చుట్టూ కూడా క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా ‘గీత గోవిందం’ సక్సెస్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మరింత బిజీ ఆవ్వడమే కావడమే కాదు.. ‘డియర్ కామ్రేడ్’ లో మళ్ళీ జోడీగా నటించే అవకాశం అందుకున్నారు. అయితే ఈ క్రేజ్ ఈ సినిమాతో కూడా ఆగేలా లేదు. 

జస్ట్ ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ కే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక ల కెమిస్ట్రీపై ఎక్కడ చూసినా ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తే.. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లా నటించాడు.    

 

విజయ్ దేవరకొండ సినిమాలంటే మామూలుగానే క్రేజ్ ఉంటుంది. కానీ ఆ సినిమాలో రష్మిక ఉందంటే వీళ్ళిద్దరి నుండి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు సెట్ అవుతున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ లో మేకర్స్ ఆల్మోస్ట్, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే ప్రతి ఎలిమెంట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారనిపిస్తుంది.

‘గీత గోవిందం’ తరవాత ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా కూడా  సక్సెస్ అయిందంటే.. వీళ్ళిద్దరు జోడీగా మరిన్ని సినిమాలు తెరకెక్కే చాన్సెస్ కనిపిస్తున్నాయి. గతంలోనూ కొన్ని సినిమాలతో క్రేజీ ఆన్ స్కీన్స్ కపుల్ అనిపించుకున్న సార్స్ ఉన్నారు కానీ. రీసెంట్ టైమ్ లో అయితే వీళ్ళిద్దరే.