బన్నీ ప్లానింగ్.. ఒకేసారి 2 సినిమాలు

Thursday,May 30,2019 - 05:16 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడని అంతా భావించారు. కానీ బన్నీ రూటు మార్చాడు. ఒకేసారి 2 సినిమాలు చేయబోతున్నాడు.

అవును.. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి 5వ తేదీ నుంచి ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు నెల రోజుల షెడ్యూల్. అది కంప్లీట్ అయిన వెంటనే ఐకాన్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఇలా 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనేది బన్నీ ప్లాన్.

త్రివిక్రమ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఐకాన్ ను వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు. “నా పేరు సూర్య” తర్వాత వచ్చిన ఏడాది గ్యాప్ ను ఇలా 2 సినిమాలతో భర్తీ చేస్తున్నాడు అల్లు అర్జున్.