త్రివిక్రమ్ ఈసారి కూడా ‘అ’నుకుంటున్నాడా...?

Thursday,April 25,2019 - 12:02 by Z_CLU

నిన్నమొన్నటి వరకు బన్ని, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే డిస్కషన్స్ నడిచాయి. ఫస్ట్ షెడ్యూల్ ఇలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఈ సినిమా టైటిల్ చుట్టూ ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మళ్ళింది. అంతలో ఈ సినిమా టైటిల్  ‘అలకనంద’ అంటూ సోషల్ మీడియాలో కొత్త టైటిల్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

నిజంగానే ఈ సినిమా టైటిల్ ‘అలకనంద’ కానుందా..? చెప్పలేం… త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలుగా తూ.చ. తప్పకుండా పాటిస్తున్న సెంటిమెంట్ యాంగిల్ లో ఆలోచిస్తే 100% చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ టైటిల్ లో మొదటి అక్షరం ‘అ’ కాబట్టి.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘S/o సత్యమూర్తి’ తరవాత,  ప్రతి సినిమా టైటిల్ ‘అ’ తోనే స్టార్ట్ అవుతుంది. నితిన్, సమాంతల సినిమా ‘అ..ఆ’ లతో బిగిన్ అయితే వరసగా ‘అజ్ఞాతవాసి’, రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అరవింద సమేత’ కూడా ‘అ’ అక్షరం తో బిగిన్ అయిందే.

ఇదంతా ఏదో అలా జరిగిపోయిందంటే చెప్పలేం కానీ, త్రివిక్రమ్ నిజంగానే ‘అ’ అక్షరాన్ని సెంటిమెంట్ గా తీసుకునే ఇలా ఫిక్స్ అయి ఉంటే మాత్రం ‘అలకనంద’ గురించి ఆలోచించాల్సిందే.